Breaking News

మాజీ ఎంపీపి జనగామ శరత్ రావు స్వగృహంలో అయ్యప్ప అభిషేకాలు.

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని అయ్యప్ప ఆలయ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణానికి చెందిన ఎంపీపీ జనగామ భాగ్యశ్రీ శరత్ రావు. దంపతులు నిర్వహించిన పడిపూజకు అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి గణపతి హోమము. స్వగృహంలో సత్యనారాయణ వ్రతం. పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు.అయ్యప్ప పూజలు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, జిల్లా మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం