మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి
సిద్ధిపేట జిల్లా జగదేవ పూర్ మండలం లోని తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గల ప్రసిద్ధిపుణ్య క్షేత్రం శ్రీకొండపోచమ్మ ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలను గత మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం
శివపార్వతుల కల్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ నిర్వాహకులు స్థానిక గ్రామ మాజీ సర్పంచ్ రజిత రమేష్, ఈ ఓ రవి కుమార్ ల సమక్షంలో కనుల పండువగ నిర్వహించారు.
చివరిరోజు అమ్మ వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
కళ్యాణానికి హాజరైన భక్తులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో హరిబాబు,ఆంజనేయులు,చిన్న యాదగిరి,స్వామి,కనకయ్య, ఐలయ్య ,తిరుపతి,కిషన్,
ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.