
పేట్ బషీరాబాద్ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాలపై మల్కాజిగిరి ఆర్డిఓ కి ఫిర్యాదు
మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, పేట్ బషీరాబాద్ గ్రామం, సర్వే నెంబర్ 25(1&2) నందు 248 ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ వ్యక్తులు, నిర్మాణ సంస్థలు కబ్జా చేసుకుని, ప్లాట్లు వేసి ప్రజలకు అమ్ముకోవడం, ప్రభుత్వం మారిన కూడా ఆక్రమణలు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని, పూర్తిస్థాయిలో సర్వే చేసి, ప్రభుత్వ భూమిని కాపాడి, ప్రజా అవసరాలకు వినియోగించాలని మల్కాజిగిరి ఆర్డిఓ కి ఫిర్యాదు చేయడం జరిగింది

.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మండలం, పేట్ బషీరాబాద్ గ్రామం నందు సర్వేనెంబర్ 25(1&2) లో 428 ఎకరాల స్థలం కలదు, దాని నందు ప్రభుత్వ భూమిగా ప్రస్తుతం నిషేధిత జాబితాలో 254 ఎకరాల స్థలము కలదు. ఈ స్థలం నందు 25/2 పోలీస్ స్టేషన్, స్కూల్ మరియు జర్నలిస్ట్ సంఘాలకు ప్రభుత్వ భూమి కేటాయింపులు చేయడం జరిగింది. మిగిలిన ప్రభుత్వ స్థలం నేషనల్ హైవే ఆనుకుని ఉండటం వల్ల కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో గత పది సంవత్సరాల్లో దాదాపు 80 శాతం భూమిని కబ్జా చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ భూమిలో చిన్న చిన్న నిర్మాణాలు మరియు ఇంటి నెంబర్లు మరియు జీవో 58 & 59 అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. అంతేకాకుండా నేషనల్ హైవే ఆనుకొని దాదాపు 4 ఎకరాల స్థలంలో(25/1) నర్సరీ మరియు ఫామ్ హౌస్ నిర్మాణాలు జరగడమే కాకుండా కనీసం అధికారులు చర్యలు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. గతంలో రంగారెడ్డి బండ కాలనీ నందు ప్రజలకి ప్రభుత్వ భూములు నుంచి పట్టాలి ఇవ్వడం జరిగింది. కానీ మిగతా ప్రదేశాల నందు ఎలాంటి అనుమతులు గాని మరియు పట్టాల పంపిణీ జరగకుండా గత తొమ్మిది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద సహకారంతో దాదాపు 50 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఆక్రమణలే కాకుండా అక్రమ నిర్మాణాలు కూడా రావడం జరిగింది. చివరికి ప్రభుత్వ భూమిని తమ భూమిగా చెప్పుతూ ట్రాఫిక్ పోలీస్ నిర్మించిన పోలీస్ స్టేషన్ ను కూడా కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ భూములు దాదాపు 2 ఎకరాల ఆక్రమించుకొని అపర్ణ కన్స్ట్రక్షన్ వారు నిర్మాణం చేస్తున్నారా.. అనేది ప్రాథమిక సమాచారం. అంతేకాకుండా యాదిరెడ్డి బండ నందు (25/1) దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ స్థలం నందు గతంలో ప్రభుత్వం క్వారీ లీజ్ ఇవ్వడం జరిగింది, ఆ క్వారిని మొత్తం టిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే అండదండలతో మొత్తం పూడ్చి వేసి, కబ్జా చేసి చిన్న చిన్న ఫ్లాట్లుగా చేసి పేద ప్రజలకు అమ్మకం చేయడమే కాకుండా, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో GO 58&59 ద్వారా వందలాది ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం, కానీ అప్పటి డిప్యూటీ కలెక్టర్ మరియు ఆఫీసర్ సర్వే నెంబర్ 25/1 పేట్ బషీర్బాద్ నందు జీవో నెంబర్ 58 59 పథకం ద్వారా ఎలాంటి రెగ్యులరైజేషన్ చేయకూడదని ఉత్తర్వులు(ఎల్ఆర్. నం. LP/1010/2021-14 , డేట్ 30-3-2022) ఇచ్చిన, ఈ సర్వే నెంబర్లు ఏ విధంగా రెగ్యులరైజేషన్ చేసి ప్రభుత్వ పట్టాలు ఇచ్చారని కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నాం?. నిజమైన లబ్ధిదారులకి ఈ జీవో ద్వారా రెగ్యులరైజ్ చేయడానికి మేము సమర్థిస్తున్న దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడాని వ్యతిరేకిస్తున్నాం. సర్వేనెంబర్ 25/1 నందు నర్సరీ రెండు ఎకరాలు, గెస్ట్ హౌస్ మరో రెండు ఎకరాలు, ఇతర నిర్మాణాలు 10 ఎకరాలు, మరియు యాదిరెడ్డి బండ నందు 5ac మరియు అపర్ణ కన్స్ట్రక్షన్ రెండెకరాలు ఆక్రమించుకొని ఆక్రమణ నిర్మాణాలు చేయడమే కాకుండా, మరికొన్ని స్థలాలు ఆక్రమించుకొని కాంపౌండ్ వాల్ చిన్న చిన్న నిర్మాణాలు చేసుకొని, ప్రభుత్వ భూమిని తమ గుప్పెట్లో పెట్టుకొని అధికారులను మేనేజ్ చేసుకుని కోర్టు కేసు వేస్తూ వాటికి సరైన కౌంటర్ రెవెన్యూ అధికారులు వేయకుండా మేనేజ్ చేస్తూ దాదాపు 500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వము ఈరోజు కబ్జాల గురైందంటే రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పరీక్ష సహకారం మరియు స్థానికంగా గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మరియు వారి అనుచరులు అందరు కలిసి ప్రజాస్తిని కొల్లగొట్టారని సత్యం. అంతేకాకుండా జర్నలిస్టులకు 25/2 ప్రభుత్వ భూమి కేటాయించింది, కానీ ఇప్పటివరకు వారికి అధికారికంగా అప్పజెప్పకపోవడమే కాకుండా జర్నలిస్టుల స్థలం కూడా కబ్జాకి అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించడం సిగ్గుచేటు.కావున తక్షణమే సర్వేనెంబర్ 25/1, 2 ప్రభుత్వ స్థలం 248 ఎకరాలు పూర్తిస్థాయిలో ఎడి సర్వే చేయించి సరైన అనుమతులు లేని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, కబ్జాదారులపై కేసు నమోదు చేయడమే కాకుండా, కోర్టు కేసు నందు సరైన కౌంటర్ నమోదు చేసి ప్రజా ఆస్తులను రక్షించి, ప్రజా అవసరాలకు వినియోగించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్ల జై శంకర్ గౌడ్, అరుణ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.