బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్

ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల

_ విధ్యా బోధనలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

_ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి.

_ విద్యాలయాల ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యత పై ప్రత్యేక దృష్టి సారించి , విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ లోని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా విద్యాలయం ఆవరణలో పరిశుభ్రత పనులు పరిశీలించారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి,కూరగాయలు, పండ్లు ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పలు కూరగాయలు, పండ్ల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్ళారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. నర్సింహులపల్లి, తంగళ్లపల్లి లోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో నిష్ణాతులను చేయాలని సూచించారు. స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు.


జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.