Breaking News

కేసముద్రం మండలం శ్రీ వివేక వర్ధని విద్యార్థుల ప్రతిభ

మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మండలంలోని శ్రీ వివేకవర్ధిని విద్యార్థులు చెకుముకిలో జిల్లా స్థాయి కి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు.శుక్రవారం పాఠశాలలో జిల్లా స్థాయికి ఎంపికైన ఎస్ డి హర్సియా, బి ఓం సాయి, ఎస్ లోకేష్, లను ఘనంగా సన్మానించారు..అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి మండల స్థాయి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికవడమే కాకుండా జిల్లాలోనే పాఠశాలకు చెందిన విద్యార్థులు 33/40 మార్కులతో ప్రథమ స్థానంలో ఉండటం విశేషం అన్నారు..
ఈ సందర్భంగా విద్యార్థులను చెకుముకి పరీక్షకు సిద్ధం చేసిన సైన్సు ఉపాధ్యాయులు ఎండీ హఫీజ్ పాషా, కే సుభాష్, ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిర్ర నరేష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు…