Breaking News

పశువులకు ఉచిత గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరం

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామంలో శుక్రవారం పశువులకు ఉచిత గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. 26 గర్భ కోశ వ్యాధుల చికిత్సకు గాను 2 కృత్రిమ గర్భధారణ, 4 సాధారణ చికిత్సలు చేశారు. 22 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశుఘన అభివృద్ధి సంస్థ వారు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి జైపాల్ సింగ్, రైతు నగర్ పశు వైద్యాధికారి డాక్టర్ మహేష్ నాయక్, సూపర్వైజర్ తిరుపతి, గోపాల మిత్ర ప్రవీణ్, మైసయ్య, సాయిలు, సిబ్బంది ఓఎస్ ఖాదర్, రైతులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం