Breaking News

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు దుర్గాప్రసాద్ ఎంపిక

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని చెన్నూరు మహర్షి విద్యా మందిర్ లో 9వ తరగతి చదువుతున్న రావుల దుర్గాప్రసాద్ 14వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల కరస్పాండెంట్ జి. నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటాచారి తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగే రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు దుర్గాప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ దుర్గాప్రసాద్ను అభినందించారు.