మన ప్రగతి న్యూస్/హత్నూర:
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ జ్యోతి తండ్రి నర్సింలు, కు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు దండు ప్రవీణ్ రావు, చేతుల మీదుగా 18000 రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చెక్కును అందజేయడం జరిగింది అన్నారు. ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ సురేష్ గౌడ్, చంద్రశేఖర్ రావు, లక్ష్మణ్ చారి, తదితరులు పాల్గొన్నారు.