Breaking News

బీసీ ఏ లకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలి

వరంగల్ జిల్లా ఆడ్ హక్ కమిటీ కన్వీనర్ గుంటి కిషన్

మన ప్రగతి న్యూస్ /వరంగల్

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

తెలంగాణా రాష్ట్ర వెనుకపడిన తరగతుల సంక్షేమ సంఘం డెడికేషన్ కమిషన్ చైర్మన్(బూసాని వెంకటేశ్వర్లు) కి వినతి పత్రం అందించిన వరంగల్ జిల్లా అడ్హక్ కమిటి కన్వినర్ గుంటి కిషన్, కో కన్వినర్ జీజుల విజయ్ ప్రకాష్, బీ.సి-ఎ కులాల కార్యదార్శి డా,, బయ్య సాంబమూర్తి, జీజుల సాగర్, డా,, మండల సాంబయ్య బీ.సి-ఎ కులాల భాద్యులు వెనుకబడిన తరగతుల సంక్షేమం స్థానిక సంస్థలలో బీ.సి లకు 42 శాతం రిజర్వేషన్ పెంచుటకై ముఖ్యంగా ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో వెనుకబడిన బీ.సి-ఎ కులాలకు రాజకీయ రిజర్వేషన్ 15 శాతం కల్పించాలని కమిషన్ కు విజ్ఞప్తి చేసినారు.ఇప్పటికి గోదావరి నది తీర ప్రాంతం లోని బెస్త, గుండ్ల బెస్త, రజక, నాయి బ్రాహ్మణ, బోయ, వడ్డెర, మేదర, పూసల, గంగిరెద్దుల, జోగిని 57 కులాలు రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్ కల్పించినప్పుడే బీ.సి-ఎ వారు రాజకీయంగా విద్యావంతులుగా ఎదుగుటకు కారణమవుతుందని మనవి చేసినారు.