Breaking News

వేధింపులకు గురౌవుతున్న మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

మన ప్రగతి న్యూస్/వరంగల్ క్రైమ్ :

మహిళలు ఎక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతుంటే మౌనం పాటించకుండా ధైర్యంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మహిళలు, విధ్యార్థునులకు పిలుపునిచ్చారు. వివిధ ప్రదేశాల్లో మహిళలు ఏవిధమైన లైంగిక వేధింపులకు గురౌవుతున్నారు. తక్షణమే సదరు బాధిత మహిళలు స్పందించాల్సిన తీరుపై మహిళలకు అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ మహిళ రక్షణ విభాగం నూతనంగా రూపొందించిన వాల్‌పోస్టర్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మహిళలు బాలికల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన పట్లకూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా మహిళలు, బాలికలు,అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వుండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని. ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,
మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న, అలాగే ర్యాగింగ్‌ ముగుగులో విద్యార్థునులు సైతం వేధింపులకు గురౌవుతున్న మహిళలు, విధ్యార్థునులు, బాలికలు మౌనంతో వుండిపోకుండా, ధైర్యంగా స్థానిక షీ టీం బృందాన్ని సంప్రదించాలని, మహిళల భద్రత కోసమే షీ టీం లేదా డయల్‌ 100 సమాచారం ఇవ్వాలిందిగా పోలీస్‌ కమిషనర్‌ మహిళలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసిపి జితేందర్‌ రెడ్డి, వరంగల్‌ షీ టీం ఇన్స్‌స్పెక్టర్‌ సుజాతతో పాటు షీ టీం సిబ్బంది పాల్గోన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం