Breaking News

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జడ్పీ సీఈవో స్వప్న

మన ప్రగతి న్యూస్/హత్నూర:

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో హత్నూర మండల ప్రత్యేక అధికారి స్వప్న పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో శంకర్ తో కలిసి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని లక్మా తాండ గ్రామాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ స్వప్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో ఉన్నటువంటి పురవీధులు శుభ్రపరచడంతో పాటు డ్రైనేజీలను ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డ్రైడే దినంగా పాటించాలన్నారు. డ్రైడే పాటించడం వల్ల వారంలో ఒకరోజు ఇంటి లోపల బయట ఎటువంటి పదార్థాలు నిల్వ చేయకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

విద్యార్థులు ప్రతిరోజు సూచి శుభ్రత పాటించాలన్నారు. లక్మా తండా అంగన్వాడి కేంద్రం పాఠశాలను సందర్శించి పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్ కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.