మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని కస్తూరిబా పాఠశాలను తహసిల్దార్ ముప్పుకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్ ను, వంట సామాగ్రిని పరిశీలించారు. పిల్లలకు వండిన వంటలను రుచికరంగా ఉన్నాయా లేదా అని పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు వేడి నీరు సరఫరా చేయాలని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు కల్పించే అన్ని సదుపాయాలు యధావిధిగా అందుతున్నాయ లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఆర్ఐ రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.