
మన ప్రతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల హాస్టల్ ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు.విద్యార్థులకు అందుతున్న విద్యను,భోజన సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కొలుపులు అమరేందర్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు,పట్టణ శాఖ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్,స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.