మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో వారాంతపు కార్యక్రమాలలో భాగంగా ఫ్రూట్స్ డే ను ఘనంగా నిర్వహించారని పాఠశాల ప్రిన్సిపల్ గూడూరు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ ఫ్రూట్స్ వేషధారణలో వచ్చి ఆ ఫ్రూట్స్ యొక్క ప్రాముఖ్యత మరియు అందులో లభించే విటమిన్ ల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మన నిత్య జీవితంలో ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే లాభాలు దానివల్ల లభించే విటమిన్ ల వల్ల మన ఆరోగ్యం నిలకడగా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ తప్పకుండా ప్రతిరోజు ఫ్రూట్స్ తినాలని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ వేములపల్లి సుబ్బారావు , ప్రిన్సిపల్ గూడూరు ప్రవీణ్ కుమార్, ఇంచార్జ్ రాధ, ఉపాధ్యాయులు శ్రీలత, చందన, యాస్మిన్, వీణ, పింకీ, శారద, ఉమా, వెన్నెల మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.