మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నర్సంపేట నియోజకవర్గం కంటెస్టెంట్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంభంపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు.. ఘాన విజయం సాధించిన “మహాయుతి కూటమికి” ఆయన శుభాకాంక్షలు తెలిపారు.యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని ఎలా సమర్థిస్తూన్నరో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. భారతదేశ అభివృద్ధికి రాచబాట వేసింది మన నరేంద్రుడే, పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమన్నారు.
ప్రపంచ దేశ విదేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు అతి ఉన్నతమైన స్థానాల్లో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మహానీయుడు “మన నరేంద్రుడి” నాయకత్వం బలపరిచి,వారిని ఆశీర్వదించి, అభిమానించి, ఆక్కున్న చేర్చుకున్న మహారాష్ట్ర ప్రజలకు మరియు మహారాష్ట్ర బిజెపి కార్యకర్తలు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేశారు.