
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో చిత్తుబొత్తు డబ్బులు పెట్టి ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో జూదం లాంటి ఆటలు పేకాట గాని చిత్తుబొత్తు గాని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా యువత గంజాయి, అసాంఘిక కార్యక్రమాల పట్ల డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ ఆటలో పాల్గొన్న 14 మంది వ్యక్తులతో పాటు 1600 రూపాయలు ,ఏడు మోటర్ సైకిళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.