Breaking News

నర్సంపేట మున్సిపాలిటీలో ఎం జరుగుతుంది.

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

నర్సంపేట పట్టణ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందని ప్రశ్నించిన బిజెపి జిల్లా దళిత మోర్చా నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ గా రావాలంటే ఎందుకు భయపడుతున్నారు.
నర్సంపేట మున్సిపాలిటీ కీ రెగ్యులర్ కమిషనర్ ను తీసుకురావడంలో ఎందుకు చొరవ చూపని శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డనీ ప్రశ్నించారు.
సుమారు 6 నెలలుగా నర్సంపేట పట్టణ మున్సిపాలిటీలో కమిషనర్ లేక పట్టణ అభివృద్ధి కుంటిపడిపోతున్నది పట్టణంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు రోడ్డు కిరువైపులా చెత్తాచెదారంతో నిండిపోయినది.పర్మినెంట్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ వెళ్లిపోవడంతో ఇన్చార్జిగా వర్ధన్నపేట కమిషనర్ వారంలో రెండు రోజులు నర్సంపేట మున్సిపాలిటీకి కేటాయించడం జరిగేది. ఇప్పుడు ఎవరు లేకపోవడంతో ఇదే అదునుగా ఒక సామాన్య కాంట్రాక్టు ఉద్యోగి శ్రీధర్ మున్సిపాలిటీలో అన్ని నేనే అన్నట్టు నేను చెప్పిందే వేదం అన్నట్టు ప్రతి విషయంలో వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్ లో, ఇంజనీర్ విభాగం లో శానిటేషన్ లో తలదుర్చడం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కీ ఇన్ని అధికారాలు ఎవరిచ్చారు. పై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆడింది ఆట పాడింది పాటగా స్వంత నిర్ణయాలు తీసుకోవడం. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కు తెలియకుండా, మున్సిపాలిటీ కౌన్సిల్ లో అప్రూవల్ లేకుండా కడియం నుంచి మొక్కలు తీసుకురావడం లో ఇతనికీ సంబంధం ఏమున్నది. వర్షాకాలం కు ముందు వచ్చే మొక్కలు శీతాకాలంలో 25 వేల మొక్కలు ఎందుకు తేవల్సిన అవసరం ఏముంది. వాటి పర్యవేక్షణ ఎవరు చేస్తారు. పట్టణం లో సుమారు 15 నల్ల కలెక్షన్ లు ఎలాంటి అప్రూవ్ లు లేకుండ ఎవరికీ ఇచ్చారో పేర్ల తో సహా రానున్న రోజుల్లో బయటపెట్టడం జరుగుతుందని అన్నారు. ఆర్డిఎంఏ అధికారులు తక్షణం అతని మీద తగిన చర్యలు తీసుకొవలని లేని యెడల ఆర్ డి ఎం ఏ వరంగల్ ఆఫీస్ ముందు నర్సంపేట బీజేపీ శ్రేణులు ధర్నా చేస్తామని నర్సంపేట బీజేపీ తరుపున హెచ్చరించారు.