Breaking News

శభాష్ చంద్రమోహన్ – డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ( డిజిపి )జితేందర్

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ గంజాయి మరకత ద్రవ్యాన్ని మత్తుపదార్థాలని అరికట్టడానికి జగదేవపూర్ ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో కఠిన తరహా నిబంధనలు అమలు చేస్తూ ఇటీవల పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినందుకుగాను తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ టీ జి ఎన్ ఏ బి డైరెక్టర్ సందీప్ శాండిల్య ఏ డి ఎల్ డి జి ఎల్ అండ్ ఓ మహేష్ భగవత్ ల చేతుల మీదుగా రెండు రివార్డులను జగదేపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్ ను అభినందించి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రమోహన్ ఎస్ఐ మాట్లాడుతూ ఈ రివార్డులు నాపైన మరింత నమ్మకాన్ని బాధ్యతలను పెంచాలని పోలీస్ అంటే సమాజ రక్షకులుగా ప్రత్యేకించి మహిళల రక్షణ కొరకు రాత్రింబవళ్లు తేడా లేకుండా సేవలందిస్తామని రాష్ట్ర డిజిపి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని సహకరించిన పోలీస్ స్టేషన్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.