Breaking News

జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి గా పోలేపల్లి శ్రీను

మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో

మహబూబాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలో ఉత్కంఠ భరితంగా జరిగిన న్యాయశాఖ ఉద్యోగుల ఎన్నికలలో జిల్లా కోర్టులో బెంచ్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్న పోలేపల్లి శ్రీను తన సమీప ప్రత్యర్ధి అయిన కల్యాణ్ కుమార్ పై 8 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా కుడితి వెంకట రెడ్డి తన సమీప ప్రత్యర్ధి అయిన భూక్య అనిత పై 4 ఓట్ల అతి స్వల్ప మెజారిటీ తో గెలుపొందారు. మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అసోసియేట్ ప్రెసిడెంట్ గా అహ్మద్ ఖాన్,
వైస్ ప్రెసిడెంట్ 1,2,3 గా … స్వరూపారాణి, శివకుమార్, నిరీక్షణ,
ఆర్గనైజింగ్ సెక్రటరీగా పూస శ్రీనివాస్, ట్రెజరర్ గా వీరు నాయక్,జాయింట్ సెక్రెటరీ 1, 2, 3 గా వీరలక్ష్మి, రుచిత,ఝాన్షి లు, స్పోర్ట్స్ సెక్రెటరీ గా స్వాతి ఎన్నికయ్యారు.జిల్లా కోర్టు పరిపాలన అధికారి క్రాంతి కుమార్, సూపరింటెండెంట్ అమరేందర్ లు ఎన్నికల సంఘం అధికారులుగా విధులు నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులందరికీ వీరు ధన్యవాదాలు తెలియ జేయడం జరిగింది. అలాగే గెలుపొందిన అభ్యర్థి పోలేపల్లి శ్రీను తన గెలుపు కు సహకరించిన న్యాయశాఖ ఉద్యోగులందరికి ధన్యవాదాలు తెలిపి, వారికున్న సమస్యలను న్యాయాధికారుల దృష్టికి తీసుకెళ్లి కమిటకి ఎన్నికైన మిగిలిన సభ్యుల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం