ఏ మొహం పెట్టుకొని ఏడాది ఉత్సవాలు చేస్తారు.
కాంగ్రెస్ సర్కార్ అన్ని మంత్రి శాఖలు విఫలం
బిజెపి మండల ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల కోటి
మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని బిజెపి ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల కోటి ముఖ్య సమావేశం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ
గత పదకొండున్నర నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యింది.అని అయిన కూడా ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు ఏం మంచి చేశారని? ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు జరుపుకుంటారని
పెరుమాండ్ల కోటి ప్రశ్నించారు. గత పదకొండున్నర నెలల పాలన పూర్తి అయ్యిందని ఇందులో అన్ని ప్రభుత్వ శాఖలు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకున్న హోం శాఖ, విద్యాశాఖ తదితర ముఖ్యమైన శాఖలను ఆయన వద్ద పెట్టుకుని ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. ఇక వ్యవసాయ, రెవిన్యూ, పంచాయతీరాజ్, పౌరసరఫరాల శాఖలు కూడా ఘోరంగా విఫలమయ్యాయని, ప్రజలకు ఏం మంచి చేశారని ఏడాది సంబరాలకు సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి వాటిని మరిచిపోయారని అన్నారు. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి దగుల్బాజీ పనులని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కడుపు రగిలిన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
ప్రశ్నిస్తే స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్న వారిని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని పూర్తి దిగజారుడు రాజకీయాలకు పూనుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కరెంటు సమస్య పునరావృతమవుతున్నదని, అదేవిధంగా శాంతిభద్రతలు క్షీణించాయని… ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని గల్లా పట్టి ప్రశ్నించే రోజులు మున్ముందు ఉన్నాయని హెచ్చరించారు. పేదోడి ఆక్రోశాన్ని రాజకీయంగా చూస్తే సర్వనాశనం అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హెచ్చరించారు.
ఇది ప్రజా పాలన కాదు పేద ప్రజల గోస పాలన ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీని కూడా 100% అమలు చేయకుండా విజయోత్సవాలు ఇలా నిర్వహిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాస్తున్న కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని పేద ప్రజలకి ఉపయోగపడేలా నెరవేర్చాలని ఆయన నిందించారు కాంగ్రెస్ పాలనలో 11 నెలల 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పది రోజులకు ఒక ప్రాణం పొట్టన పెట్టుకొని ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అని విమర్శించారు.సంక్షేమ శాఖ సీఎం వద్ద ఉండడం గర్వకారణం అలాగే హైడ్రా పేరుతో వందల కోట్లు పేద ప్రజలపై దోచుకోవడం ప్రజా పాలన లేక మహారాష్ట్ర ఎన్నికలకు ఏటీఎం గా మారిన తెలంగాణ సొమ్ము ప్రజాపాలన అని వివరించి ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.