Breaking News

పాస్టర్స్ కి వేతనాలు ప్రకటించాలని రాష్ట్ర నాయకులు డా. మట్టా కి వినతి పత్రం అందించిన

ఎన్. సి. సి. జాతీయ పొలిటికల్ వింగ్ అధ్యక్షులు అలవాల కరుణాకర్.

మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

2024 క్రిస్మస్ సందర్బంగా పాస్టర్స్ కి వేతనం ప్రకటించాలని, ఎన్. సి. సి. జాతీయ పొలిటికల్ వింగ్ అధ్యక్షులు అలవాల కరుణాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్. మట్టా దయానంద్ విజయకుమార్ ని, ఎన్. సి. సి. పాస్టర్స్ బృందం కలిసి కరుణాకర్ నాయకత్వంలో వినతి పత్రం ఇచ్చారు.తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి పాస్టర్స్, క్రిస్టియన్స్ కృషి చాలా ఉంది అన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా పాస్టర్స్ ఊసు ఎక్కడా లేదన్నారు.
దయచేసి పాస్టర్స్ కి ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం పాస్టర్ కి ఒక్కొక్కరికి 12000/ పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు, మాటనిలబెట్టుకోవాలన్నారు. స్థలాలు ఉన్న పాస్టర్స్ కి ఆంక్సలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాళన్నారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర కార్యదర్శి గుర్రాల సత్యానందం, జిల్లా అధ్యక్షులు సంఘసాని శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు జాన్ మార్క్, జిల్లా ప్రేయర్ వింగ్ అధ్యక్షులు ఎబినెజర్, 5 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.