Breaking News

మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం–వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు

మనప్రగతి న్యూస్/ మంగపేట:సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని మంగపేట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు.మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అన్నారు.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు.ఎంతటి వారైనా మీడియాపై దూర్బాషలాడినా దాడికి పాల్పడిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమం లో మీడియా ప్రతినిధులు జానపట్ల జయరాజు,చెట్టుపల్లి స్నేహ కుమార్,పోలూరి సంతోష్, పొలసాని శ్రీనివాస్ రెడ్డి, ఉగ్గమల్ల గణేష్,ఈసం సురేందర్,మైప శంకర్,హజారుద్దీన్,బోడ ప్రవీణ్,గడ్డం ప్రశాంత్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం