మనప్రగతి న్యూస్/గజ్వేల్ రూరల్:
బిజెపి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీ ఎన్నికల నిర్వహణ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు 1+11 కమిటీని పార్టీ శ్రేణుల సమక్షంలో ఏకాభిప్రాయంతో నియమించాలనే పార్టీ ఆదేశానుసారం గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్ పల్లి లో197, 200 బిజెపి బూత్ అధ్యక్షులుగా బోడ్ల రమేశ్,బోడ్ల శివకుమార్,ప్రధాన కార్యదర్శులుగా దేవులపల్లి రాజశేఖర్,మాదగారి స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బిజెపి సీనియర్ నాయకులు వెంకటరమణ,జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుడిక్యాల రాములు,బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్,శక్తి కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి మైస విజయ్, పాల్గొని కార్యకర్తల సమక్షంలో ఎన్నికైన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్,బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఎగొండ,యువమోర్చా జిల్లా కోశాధికారి ఆర్కే యాదవ్, బిజెపి గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు నరసింహా ముదిరాజ్,బిజెపి నాయకులు మర్కంటి పోచయ్య మానక ప్రవీణ్ గౌడ్,మర్కంటి రాములు, మాదగారి బాబు తదితరులు పాల్గొన్నారు.