జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
టీయుడబ్లుజె(ఐ జేయు)
మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు నిరసన హైదరాబాదులో జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ సినీ నటుడు మోహన్ బాబు అతని అనుచరులు భవనశాలపై కట్టని చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ చేశారు.

తెలంగాణ స్టేట్యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బుధవారం పెద్ద ఎత్తున జర్నలిస్టులు ధర్నా నిర్వహించడం. నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలిపారు. తమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విరా హత్ అలీ, ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైజల్ అహ్మద్ పిలుపుమేరకు ఆందోళన చేపట్టామని జిల్లా అధ్యక్షుడు యాదగిరి వివరించారు.మోహన్ బాబు కుటుంబ తగాదాలు బయటికి వచ్చినప్పుడు మాత్రమే మీడియా అతని నివాస ప్రాంతానికి చేరు కున్నదని అన్నారు.మీడియాను నియంత్రించే హక్కు ,దాడి చేసే హక్కు మోహన్ బాబుకు గాని ఇతరులకు గాని లేనేలేదని ఆయన అన్నారు.ఇలాంటి దాడుల వల్ల జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న టీవీ9 జర్నలిస్టు రంజిత్ టీవీ5 వీడియో జర్నలిస్టుపై మోహన్ బాబు దాడికి పాల్పడడం దుర్మార్గమని పేర్కొన్నారు సమాజ హితానికి పాటుపడుతున్న జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమ నంతో వ్యవహరించాల్సింది పోయి నోటి దురుసుతనంతో వ్యవహరించడం కాకుండా భౌతిక దాడులకు దిగడం క్షమించ రానిదని అన్నారు ఇలాంటి దాడులు పున రావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మోహన్ బాబును, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ విచక్షణ కోల్పోయి వ్యవహరించిన మోహన్ బాబుపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి రౌడీ లాగా ప్రవర్తించిన మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అవసర మైతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతామని హెచ్చ రించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.. మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి .అంటూ నినాదాలు చేశారు.ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మమ్మద్ సిద్ధిక్, సీనియర్ నాయకులు పానుగంటి కృష్ణ, బాల ప్రసాద్ యోగానంద రెడ్డి ,రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, మతిన్ ,డేవిడ్, దండు ప్రభు,నాగరాజు గౌడ్, సునీల్, శ్రీరామ్ శేఖర్, శ్రీనివాస్ , పుట్నాల లక్ష్మణ్, ఆంజనేయులు గౌడ్, డి కృష్ణ, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరి ఫ్, సంతోష్ హరి,శివ , కృష్ణ, పవన్ యూసుఫ్, ఆమేర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓ కు వినతి పత్రం సమర్పించారు.