Breaking News

మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి దుర్మార్గం

పద్మ శ్రీ అవార్డును రద్దు చేయండి -జర్నలిస్టుల సంఘం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తండ్రి కొడుకులు తన్నుకొని కేసులు పెట్టుకుంటే వివరణ అడగడానికి వచ్చిన మీడియా జర్నలిస్టులపై స్వయంగా దాడి చేయడం దుర్మార్గమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి యు డబ్ల్యు జే) ఐ జే యు నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగార్జునసాగర్ లో మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అలుపెరగకుండా జర్నలిస్టులు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళే, గ్రామాల నుండి నగరాల స్థాయి వరకు జరుగుతున్నా అవినీతి అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేయటం హేయమైన చర్య అని తండ్రి ప్రవర్తన బట్టి కొడుకులు ప్రవర్తన కూడా ఉంటుందని దానికి నిదర్శనమే మంచు మోహన్ బాబు కుటుంబమని ఆయన అన్నారు. ఇలా సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కుటుంబం ఎంతోమంది పై దాడి చేసిందని, దాడికి గురైన బాధితులు ఎందుకులే వీళ్ళతో అని సర్ది చెప్పుకున్నారని అన్నారు. గతంలో బ్రాహ్మణులు కించపరుస్తూ దేనికైనా రెడీ సినిమా తీసి వివాదాస్పదమైన సంఘటనలు బ్రాహ్మణులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్న సందర్భంలో మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేయడానికి వచ్చిన బ్రాహ్మణ పురోహితులపై స్వయంగా మంచు విష్ణు, మోహన్ బాబు దాడి చేశారని ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సమాజం మోహన్ బాబుకు శాపనార్ధాలు పెడుతూ శత్రు పీడ హోమం , పిండ ప్రదానాల కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారని. ఇదివరకు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకుండా దౌర్జన్యం చేసిన మంచు మోహన్ బాబు కుటుంబం ఇలానే పతనమవటం ఖాయమని శాపనార్ధాలు పెట్టారని ఆయన అన్నారు. ఇప్పుడు మరలా జర్నలిస్టులపై దాడి చేయడం పాపాల పుట్టను మోహన్ బాబు పెంచుకుంటూ పోతున్నాడని అతనికి, అతని కుటుంబానికి భగవంతుడు తగురీతిలో శిక్ష విధిస్తాడని, ప్రజాస్వామ్యంలో నాలుగో మూల స్తంభమైన జర్నలిజం పై దాడి చేయడం అత్యంత ప్రమాదకరమని, అయ్యప్ప దీక్షలో ఉన్న ఎలక్ట్రానిక్ జర్నలిస్టుపై, మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం క్షమించరానీ నేరమని, జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా వార్తలు సేకరించే క్రమంలో మోహన్ బాబు ఇంటికి వెళితే స్వయంగా అతను దాడి చేయడమే కాకుండా, బౌన్సర్లను, గూండాలను, రౌడీలను పెట్టి మీడియా మిత్రులపై దాడి చేయడం చట్టరీత్యా నేరమని దీనిపైన తక్షణమే ప్రభుత్వం మోహన్ బాబు, మంచు విష్ణు తదితర గుండాలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు రీతిలో శిక్షించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మోహన్ బాబు కి గతంలో కేంద్ర ప్రభుత్వం 2007లో ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.