Breaking News

ప్రజా సమస్యలు పట్టించుకోని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో : జనగా మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్లు జనగామ పట్టణ సమస్యలను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అన్నారు. జనగామ పట్టణ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగామ పట్టణంలో ఎక్కడ చూసినా కోతులు,కుక్కలు, పందులు, దోమలు దర్శనమిస్తున్నాయనిపట్టణంలోని వివిధ వార్డులలో బెల్ట్ షాపులను అక్రమ సిట్టింగులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువకులకు ఉపాధి కల్పించాలి. ఐఎస్ఐ మార్కు లేని వాటర్ ప్లాంట్లను మూసి మూసివేయా లని డిమాండ్ చేశా రు. జనగాం పట్టణ సమీపానగల చీట కోడూర్ రిజర్వాయర్ ఫిల్టర్ బెడును నాణ్యత ప్రమాణాలతో క్రమబద్ధీకరించి, నాణ్యతతో కూడిన మంచినీటిని ప్రజలకు అందించాలి కోరారు. జనగామ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, రోగులకు కావలసిన మందులను అందు బాటులో ఉంచాల న్నారు. జనగామ పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలి ఇవ్వాలిని, 53/ సర్వే నెంబర్ లో ధర్మపంచ సంజయ్ నగర్ లలో పట్టాలు ఇవ్వాలని అన్నారు. జనగామ పట్టణంలో అండర్ డ్రైనేజీని ఏర్పాటు చేసి వర్షాకాలంలో వరద నివారణ చర్యలు చేపట్టాలని, జనగామ పట్టణంలో చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చివేసి చెరువు లను కాపాడాలని కోరారు. జనగా పట్టణంలో సెంటర్ డివైడెడ్ పనులు అసంపూర్తిగా నాణ్యత లేకుండా పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని కోరారు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఇంటి కోసం అప్లై చేసుకున్న అందరికీ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనను చేపడతామని హెచ్చరించారు
ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు ఎండి అజారుద్దీన్ కళ్యాణం లింగం బాల్నే వెంకట మల్లయ్య పందిళ్ళ కళ్యాణి పాము శ్రీకాంత్ బండ సౌందర్య ధరావత్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం