- జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ముందస్తు బోదకాల వ్యాప్తి గుర్తింపు సర్వే
- పురపాలక సంఘం క్యాతనపల్లిలో బోదకాల వ్యాధి నివారణ కార్యక్రమం
- భోదకాల వ్యాధి నివారణ కార్యక్రమానికి అందరూ సహకరించగలరు కమిషనర్ గద్దరాజు
- రోగ రహిత పట్టణం నిర్మిద్దాo పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుదాం డా. సి మానస
మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంతంలో బోదకాలు వ్యాధి నివారణ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జాతీయ కీటక జనత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంచిర్యాల ముందస్తు బోదకాలు వ్యాప్తి గుర్తింపు సర్వేలో భాగంగా రాత్రిపూట రక్త నమూనాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.డాక్టర్ సి. మానస మాట్లాడుతూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమల నివాస స్థావరాలు గుర్తించి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలని ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళావతి, డాక్టర్ మానస,అకౌంటెంట్ మోహన్,కొక్కుల సతీష్, సూపర్వైజర్ పి.హెచ్.ఎం.కె సురేఖ, ఏ.ఎన్.ఎం.లు లావణ్య, జి.రాజేశ్వరి, ఎస్ పుష్పలత బి. భారతి,ఎస్.కవిత 19 మంది ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.