మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి (హరిహర)ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత రెండు నెలల క్రితం వేదిక ప్రమాదంలో గాయపడి కోలుకున్న ఝాన్సీ రెడ్డి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయాల పాలైన తాను త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు కుల మతాలకతీతంగా పూజలు చేశారని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గం ప్రజల పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించానన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, మాజీ ఉప సర్పంచ్ మారం శ్రీనివాస్, నాయకులు పెనుగొండ రమేష్, కామారపు సునీల్ తదితరులు పాల్గొన్నారు.