మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం మణికంఠ సన్నిధానం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా అయ్యప్ప స్వామి అష్టభిషేకలను రాజు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఉదయం గణపతి హోమం అనంతరం అయ్యప్ప స్వామికి పాలాభిషేకం, పెరిగాభిషేకం, నెయ్యాభిషేకం,గంధాభిషేకం, బస్మాభిషేకం, పన్నీర్ అభిషేకం పుష్పాభిషేకం కనిక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం గురుస్వామి, బాలాజీ స్వామి సంతోష్ స్వామి, రాజేందర్ స్వామి, కాలభైరవరాజు స్వామి , తెర్లు మద్ది రాజు స్వామి, దబ్బెడ రాజు స్వామి, అజయ్ స్వామి, విజయ స్వామి, కూర సంతోష్ స్వామి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దేవేందర్ కొండాపూర్ రాజు, నందకుమార్ కృష్ణమూర్తి నరసయ్య కుందన్ దేవరాజు.కుబేర డ్రెస్సెస్ శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు