_ఈవో, ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి.
_ కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల మేజర్ గ్రామపంచాయతీ ఈవో,ప్రత్యేక పాలనాధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.హై స్కూల్ ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.నెలల తరబడి ప్రధాన గేట్ వాల్ తుప్పు పట్టడం,మురికి నీరు తో కూడిన నీరు ప్రజలకు సరఫరా అవుతున్న అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు. కలుషిత నీరు త్రాగి ప్రజల ప్రాణాలకు ఏమైనా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణ కేంద్రంలో తరచుగా పర్యటించి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో గుర్తించి సిబ్బందికి సూచనలు చేయాలని అన్నారు. తుప్పు పట్టిన గేట్ వాల్ తొలగించి, కొత్త గేట్ వాల్ ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని పేర్కొన్నారు.