Breaking News

నీలోజిపల్లిలో కత్తిపోట్ల కలకలం..

మన ప్రగతి న్యూస్ /బోయినిపల్లి మండలం:

రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన సింగిరెడ్డి వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన అతని తల్లిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గాయపడిన వెంకటేష్, అతని తల్లిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

మైనర్‌పై లైంగిక వేధింపులో నిందితుడికి 10 ఏళ్ల జైలు