బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మైనర్‌పై లైంగిక వేధింపులో నిందితుడికి 10 ఏళ్ల జైలు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం :మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన (పోక్సో) కేసులో నిందుతుడీకి పది సంవత్సరాలు జైలు,5000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కేసు వివరాలు.. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ అమ్మాయిను ఎ2 ఎదురుగట్ల అజయ్ సన్/ఆఫ్ ఎల్లయ్య, 27వయసు,అంబేద్కర్ నగర్,వేములవాడ అతను ఎ1 అయిన గౌరవేణి నాగరాజు(జువేనైల్) కలిసి కిడ్నప్ చేసి బలవంతపు వేధింపులకు పాల్పడగా విక్టీమ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అప్పటి వేములవాడ డిఎస్పీ వెంకటరమణ దర్యాప్తు అనంతరం నిందితుడి రిమాండ్ చేసిన అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు తీర్పు… కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్, సీఎంస్ కనిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 18 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు. శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన ఎ2.ఎదురుగట్ల అజయ్ కు పది సంవత్సరాల జైలుతో పాటు 5000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఇట్టి కేసులో ఎ1 అయినటువంటి గౌరవేణి నాగరాజు(జువేనైల్) కావడంతో అతనిపై కేసు జువినల్ కోర్టులో నడుస్తున్నది. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ… సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణజరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు ఈకేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారి డిఎస్పీ వెంకటరమణ, ప్రస్తుత సి.ఐ వీరప్రసాద్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు,కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ నవీన్, వెన్నెల లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం