Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు..

_ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఎస్ రజిత

రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్:

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భస్రావ మాత్రలు విక్రయిస్తే ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం సదరు మెడికల్ షాపుల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, షాపులను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని కెమిస్ట్రీ భవనంలో ఔషధ నియంత్రణ మరియు పంపిణీపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అధ్యక్షతన, అడిషనల్ డైరెక్టర్ (ఔషధ నియంత్రణ) రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో జిల్లాలోని మెడికల్ షాపుల యజమానులు, ఫార్మసిస్టులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మత్తు కలిగించే మందులు, నిద్ర మాత్రలను డాక్టర్ల సిఫార్సు లేకుండా అమ్మడం చట్టరీత్యా నేరమని అన్నారు. సొంత వైద్యం ప్రాణాంతకమని,డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్, నిద్ర మాత్రలు వాడటం వల్ల కాలేయం, మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఉందని, అలాగే మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. చిన్నపిల్లలకు మందులు అందుబాటులో లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.