Breaking News

ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి

చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్

మనకు ప్రతి న్యూస్/ నర్సంపేట

10 వార్డు వివేకానంద కాలనీ లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన మున్సిపాలిటీ చైర్ పర్సన్

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యం లో
నర్సంపేట బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య
అతిధులుగా మున్సిపల్
ఛైర్పర్సన్ లక్ష్మీరామనంద్ ,
మున్సిపల్ కమిషనర్ భాస్కర్
లు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఛైర్పర్సన్ లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ,
తమ ఆరోగ్య రక్షణకొరకు
ప్రతి ఒక్కరు వాకింగ్,యోగా
చేస్తూ, గేమ్స్ ఆడుతూ,బలమైన ఆహారం తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.
స్కూల్ విద్యార్థులు
జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల
అనారోగ్య సమస్యలు
వస్తాయని,ముఖ్యంగా
విద్యార్థులు వీటికి దూరంగా
ఉండి ఆరోగ్యాన్ని
రక్షించుకోవాలన్నారు.
మున్సిపల్ కమిషనర్
భాస్కర్ మాట్లాడుతూ,
ప్రతి రోజు మనం తీసుకునే
ఆహారం లోనే ఆరోగ్యం దాగి ఉన్నదని అన్నారు,ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి ఆహారంతినకుండా,అనారోగ్య భారిన పడవద్దని అన్నారు.
ప్రత్యన్మయము గా
ఆరోగ్యాన్ని అందించే బయో కవర్లు వాడుతూ,ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.కార్యక్రమం లో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ గౌడ్,కౌన్సిలర్ పొన్నాల మనిషా,ఇన్చార్జి హెడ్ మాస్టర్ రవికుమార్,బిక్షపతి,రాంబాబు,ఏ ఎస్ ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తంగెళ్ల రవికాంత్, సభ్యుడు
రాముసేవక్,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.