Breaking News

నేడే అమృత్ 2.0 ఓఆర్ఎచ్ఎస్ వాటర్ ట్యాంక్ ఎమ్మెల్యే ఆద్వర్యంలో శంకుస్థాపన

మనప్రగతి/నాగార్జున సాగర్ ప్రతినిధి

నందికొండ మున్సిపాలిటీగా  ఏర్పడిన తరువాత మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో అమృత్ 2.0 ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో  నెలకొల్పాలని చాలా రోజులు      ప్రయత్నించగా అది కార్యరూపం దాల్చలేదు. దీనితో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మోక్షం లభించి నేడు ఒక కొలిక్కి వచ్చి శంకుస్థాపనకు నోచుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనువాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  44 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నందికొండ మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న స్థలంలో నిర్మించ తలపెట్టిందని,     నేడు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆధ్వర్యంలో అమృత్ 2.0 ఓ ఆర్ హెచ్ ఎస్  ట్యాంకుల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం మున్సిపా లిటీలో ఉన్న  ప్రతి ఇంటికి  24 గంటలు నీళ్లు వచ్చే విధంగా చూడటమే అమృత్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పనులన్నీ పూర్తి చేయడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి