Breaking News

మాదిగల్లారా ఏకంకండిఈనెల 15న మాదిగ ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం

బండ శ్రీనివాస్, తిప్పారపు సంపత్ పిలుపు

మన ప్రగతి న్యూస్/

హుజురాబాద్ :

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మాదిగ కులస్తులంతా ఏకం కావాలని, మన హక్కుల కోసం పోరాడాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,తిప్పారపు సంపత్ లు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మాదిగల హక్కుల సాధనకై మాదిగలను ఏకతాటికి తీసుకు రావడానికి వివిధ రాజకీయ పార్టీలలో, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు,ప్రజా సంఘాలలో, కుల సంఘాలలో, పనిచేస్తున్న మాదిగలంతా ఏకం చేయడంలో భాగంగా ఈనెల 15న స్థానిక మధువని గార్డెన్ లో ఉదయం 10:30 రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురై జీవితాలను వెల్లదిస్తున్న మాదిగలంతా ఏకమై తమ గొంతును వినిపించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాలతోనే మాదిగ జాతి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాదిగల హక్కులు కీలక అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, మాదిగ మేధావుల ఫోరం గౌరవ అధ్యక్షులు వేల్పుల రత్నం, ప్రజా సంఘల నాయకులు వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.