Breaking News

క్రీడలతో మానసికోల్లాసం

సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి

మనప్రగతి న్యూస్/ దేవరుప్పుల:

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడలు చేపట్టారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలోని శ్రీ సాయి ప్రశాంతి స్కూల్ లో గురువారం సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతుందని అన్నారు.క్రీడలు మానసి కొల్లాసానికి దోహదపడతాయని తద్వారా క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వేలుగులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి,ఎంపిడిఓ లక్ష్మీ నారాయణ,ఎంఈవో కళావతి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు,పాఠశాల కరెస్పాండెంట్ తోటకూరి పాండు కృష్ణ,ఎస్సి,ఎస్టీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు,భూక్యా సజ్జన్,యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.