ఈనెల 18 న ఆటో లకు పిసీ నంబరింగ్ వేయించుకోవాలి
ట్రాఫిక్ ఎస్సై బండి మోహన్
మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ
వాహన రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా,ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ఆటోలను నడుపుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ సూచించారు. గురువారం మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబందనలుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈనెల 18 నుండి లోకల్ ఆటోలకు పిసి నెంబర్ ఇన్ ఇవ్వడం జరుగుతుందని దీనికి సంబంధించి ఆధార్ లైసెన్స్ ఆర్ సి సభ్యతత్వం రషీద్ తీసుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయించుకోవాలని ఆయన అన్నారు ఆటో డ్రైవర్లు తమ ఆటోల వల్ల ఇతరులకు ఆటంకాలు, ఇబ్బందులకు గురికాకుండా తమ వాహనాలను నడుపుకోవాలని సూచించారు. ఆటోలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు తమ సూచనలు హెచ్చరికలు పేడచెవిన పెడితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై ఉన్న మార్కులోపు వాహనాలను, ద్విచక్రవాహనాలను ఆపుకునేలా వాహనదారులకు సూచించారు.లేనిపక్షంలో జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా హెచ్చరిస్తామని అటు తరువాత మార్పురాని పక్షంలో చర్యలు తప్పవన్నారు. కొందరు ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. సీరియల్ వారీగా ఆటోలను ఆపుకుని, ఆర్టీసీ బస్సులకు ఆటంకాలు కల్పించకుండా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాలన్నారు. ఇష్టారాజ్యంగా కూడలిలో ఎక్కడబడితే అక్కడ ఆటోలలో ప్రయాణీకులను ఎక్కించుకొని ట్రాఫిక్కుకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. ఆటోలలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకుని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ప్రతి ఒక్క ఆటోడ్రైవర్ డ్రెస్ కోడ్ వేసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆటో యూనియన్ సంఘ నాయకులు పాల్గొన్నారు.