మన ప్రగతి న్యూస్/ నడికూడ:
గ్రామాల్లో ప్రథమ పౌరులు లేక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కేంద్రంలో డ్రైనేజీల నుండి దుర్వాసన వెదజల్లడంతో స్థానికుల సమాచారం మేరకు జి పి. సిబ్బంది, డ్రైనేజీలు మాత్రం శుభ్రం చేసి చెత్తను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. రెండు వారాలు అయినా కూడా చెత్తను తొలగించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనివల్ల ప్రధాన రహదారులన్నీ చెత్తాచెదారాలతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేసి, చెత్తను తొలగించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.