ఘనంగా ఐక్య క్రిస్మస్ సంబరాలు
ప్రముఖ దైవజనులు రాజా హేబెల్
మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్
అంధకార సంబంధమైన ఈ లోకంలో పాపము, చీకటిలో బంధించబడి నిరాశ నిష్ప్రొహలతో జీవించుచున్న
ప్రపంచ మానవాళికి సమాధానము అనుగ్రహించుటకే క్రీస్తు జన్మించాడని ప్రముఖ దైవజనులు రాజా హేబెల్ అన్నారు.

పట్టణ కేంద్రంలో లక్కినేని వారి గ్రౌండ్ నందు ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవ ఎనోష్ కుమార్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పాస్టర్ ఎబినేజర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఐక్య క్రిస్మస్ వేడుకలకు దైవ వర్తమానికులుగా ప్రముఖ దైవజనులు రాజా హేబెల్, ముఖ్య అతిథులుగా సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఎనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవజనులు రాజా హెబెల్ మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రపంచ మానవాళికి నిత్యజీవం అనుగ్రహించుటకు జన్మించారని అన్నారు.యేసు నేనే జీవము నేనే మార్గము నేనే సత్యమునని సత్యమును ప్రకటించి సత్య స్థాపన చేయుటకు ఈ లోకంలోకి మానవ రూపములో వచ్చాడని తెలిపారు. పాపులైన మనుషులకు మారుమనస్సు, పశ్చాతాపం, కలిగించుటకు యేసు మాదిరిగా నిలిచారని ఆయన తెలియజేశారు. మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ క్రిస్మస్ ప్రపంచ పండుగని క్రీస్తుని ఆరాధించుట అని ప్రపంచంలో కరుణ, శాంతి, సమాధానము స్థాపించుటకు ఏసు జన్మించాడని అన్నారు .

క్రైస్తవ భక్తులకు దైవ జ్ఞానం అందించడానికి ఇంతటి మహత్తర గొప్పకార్యాన్ని ఎఐసిసి వారు జరిగించటం ఎంతో సంతోషమని తెలియజేశారు.ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవ ఎనోష్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులు ఐక్యంగా శాంతి సమాధానముతో, ఏక మనసు, ప్రేమ కలిగి జీవిస్తూ దయామయుడైనా ఏసుక్రీస్తు ప్రభు దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. పలు గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవ సమాజానికి ఐక్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆనదింపజేశాయి. ప్రత్యేక గీతాలాపనులు,క్యాండిల్ సర్వీస్, క్రిస్మస్ కేక్ కటింగ్ తో క్రీస్తు ను ఆరాధిస్తూ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు డాక్టర్ లక్కినేని రఘు, కట్టా అజయ్ కుమార్, సీఐ హానోకు, ప్రముఖ వైద్యులు డాక్టర్ మాధవి, డాక్టర్ అచ్యుత రెడ్డి తదితరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జిల్లా ప్రేయర్ సెల్ అధ్యక్షులు రెవ నిర్మల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బిషప్ జల్ది జైపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు పాస్టర్ దాసరి డేవిడ్ రాజు, మండల అధ్యక్షులు పాస్టర్ ఎబినేజర్, గౌరవ సలహాదారులు బ్రదర్ టి సంజీవరావు, మండల ఉపాధ్యక్షులు పి దయాకర్, ప్రధాన కార్యదర్శి ఎం జాన్ పరంజ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు సమర్పణ పాల్, జీవన్ కుమార్, ట్రెజరర్ మహేష్, కమిటీ సభ్యులు పాస్టర్స్ సుందర్ రాజు, రాజశేఖర్, దైవ సేవకులు భక్తులు పాల్గొన్నారు.