Breaking News

ప్రభుత్వవిద్యాసంస్థలపైవిద్యుత్భారంపడకుండాఉచితంగా అందేలా చేయిస్తా—ఎమ్మెల్సీ బల్మూరి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యుత్ భారం పడకుండా ఉండేందుకై ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందే విధంగా చేస్తానని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నర్సింగరావు అన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి


మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మలక్పేట్, కార్వాన్ శాఖలకు సంబంధించిన మెస్చార్జీల పెంపు కార్యక్రమానికి డి ఐ జి నారాయణ నాయక్ తో కలసి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశాఖ తో పాటు విద్యాశాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దీనిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలలనుఇంటర్నేషనల్ తరహాలో ఏర్పాటు చేయబోతుందన్నారు.
హాస్టల్లో డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను
200 శాతం ప్రభుత్వం పెంచడం జరిగిందన్నారు.
ఈ విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.
విద్యాసంస్థలకు ఎలక్ట్రిసిటీ భారం పడకుండా ఉచితంగా అందేలా ప్రభుత్వంతో చేయిస్తా నని అన్నారు. అలాగే ఏ సమస్య ఉన్న అందుబాటులోఉండిమంజూరుచేయిస్తానన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం, స్నాక్స్, పండ్లుఅందజేయాలన్నారు. ఈ సంస్థలలో విద్యానివసించే విద్యార్థులను మన పిల్లలుగా చూసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పట్ల జాగ్రత్త వహించాలని ఎమ్మెల్సీ సూచించారు.
అనంతరం డీఐజీ తోపాటు, స్థానిక ఎస్సై కే భాస్కర్ రెడ్డి, తదితరులతో కలిసిఎమ్మెల్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కూర్చొని భోజనం చేశారు.