Breaking News

ఘనంగా మహర్షి పాఠశాలలో స్వయం పరిపాలన

_ విద్యార్థులే
ఉపాధ్యాయులైన వేళ

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో పాఠాలు బోధించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు తమ ఒక్కరోజు అనుభవాన్ని తెలిపారు.ఒక్కరోజు బోధించడమే చాలా కష్టంగా ఉందని అలాంటిది మా అల్లరిని భరిస్తూ మాకు అర్థమయ్యే రీతిలో బోధించడం నిజంగా ఉపాధ్యాయుల పట్ల గౌరవం, బాధ్యత పెరిగిందని ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు అన్నారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఉపాధ్యాయ బృందం పేర్కొన్నారు.