Breaking News

రాష్ట్రస్థాయికి వీరారెడ్డిపల్లి విద్యార్థుల ఎంపిక

మన ప్రగతి న్యూస్ / తుర్కపల్లి

భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని విద్యా జ్యోతి హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తుర్కపల్లి మండలం వీరారెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు అక్షర, అమ్ములు, అర్చనలు నిర్వహించిన ప్రదర్శనలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ప్రదర్శనలో బహుళ ప్రయోజని రసాయన రహిత క్లీనర్ ను తయారు చేసి ప్రదర్శించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ప్రతిరోజు జీవితంలో ఇల్లు తుడవడానికి, టాయిలెట్స్ కడగడానికి, హ్యాండ్ వాష్ చేయడానికి, కిచెన్ ఉడవడానికి, మార్కెట్లో దొరికే వివిధ రకాల రసాయనాలతో కూడిన క్లీనర్లను వాడుతున్నామని దీనివలన ఆరోగ్య సమస్యలైన ఎలర్జీ, శ్వాస సమస్యలు, క్యాన్సర్ లాంటి వ్యాధులతో పాటు నీరు, పర్యావరణం కలుషితమవుతున్నాయని అన్నారు. దీనికి బదులు బహుళ ప్రయోజని రసాయన రహిత క్లీనర్ ను వాడితే ఆరోగ్యం, పర్యావరణం సుస్థిరాభివృద్ధి ని కూడా కాపాడవచ్చు అని తెలిపారు. క్లీనర్ ని బెల్లము, సిట్రస్, ఫలాల తొక్కలు, గులాబీ పూల రెక్కలు, కర్పూరంతో తయారుచేసి, ఈ ప్రదర్శనలో ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ప్రధమ బహుమతికి ఎంపికయ్యారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బండారి సత్యం, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు .రాబోవు కాలంలో మరిన్ని ప్రదర్శనలు చేసి జాతీయస్థాయిలో అవార్డులు పొందాలని ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,జరీనా బేగం, గీత, బిక్కం సాహెబ్, వసంత ,కచ్చి గళ్ళ మల్లేశం ,విజయ్ కుమార్ ఆకాంక్షించారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి