Breaking News

అదనపు కలెక్టర్ ఆదేశాలు పాటించని మండల ఐకెపి అధికారుల తీరును నిరసిస్తూ నల్లబెల్లి ఐకెపి కార్యాలయం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని ఐకెపి అధికారుల తీరు నిరసిస్తూ ప్రజాసంఘాల, రైతుల ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం బట్టు సాంబయ్య, బోట్ల నరేష్, పులి రమేష్, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సన్న రకం వడ్లు కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేసిన రైతు కొనుగోలు కేంద్రాలో ఐకెపి అధికారులు నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. నల్లబెల్లి ఐకెపి అధికారులు రైతులకు పంపించేయాల్సిన భారదాన్ను దళారులకు అప్పగిస్తున్నారు. తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఇట్టి విషయం వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ నల్లబెల్లి మండల పరిధిలో నారక్కపేట కొనుగోలు కేంద్రంని రైతులకు అవసరమైన కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పరదాలు మంచినీటి సౌకర్యలు లేకపోవడంతో ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . అదనపు కలెక్టర్ ఆదేశాలు పాటించకుండా వివరించిన తీరుపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఐకెపి అధికారి తక్షణమే సస్పెండ్ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో అరుణ్ ,రాజన్న, మొగిలి, కుమారస్వామి, వెంకన్న, సమ్మయ్య, ప్రసాద్ , రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం