Breaking News

రహదారి సౌకర్యం కల్పించాలి…కేటిఆర్ నగర్ ప్రజల వినతి….

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

గత 15 ఏళ్ళుగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న 17 వ వార్డు పరిధిలోని కేటిఆర్ నగర్ కాలనీ ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఎంఆర్పిఎస్ దండోరా జాతీయ కార్యదర్శి,దళిత రత్నం కోండ్ర ఎల్లయ్య మాదిగ కోరారు.మంగళవారం కేటీఆర్ నగర్ కాలనీ ప్రజలు, నాయకులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎల్లయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ, ఓసి కులాలకు చెందిన సుమారు 150 కుటుంబాలు కూలీ పనులు చేసుకుంటూ ఇండ్లు నిర్మాణం చేసుకొవడం జరిగింది కానీ కాలనీ ప్రజలు నడవడానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కలెక్టర్ స్పందించి ప్రజలు నడవడానికి 24 ఫీట్ల దారి ఇప్పించి ప్రజలను అందుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయక పోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పులి శీను, మహాజన మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ రాధా, ఎంఆర్పిఎస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కుక్కల సుధా రాణి, రమా, సమ్మయ్య,అరుణ,సంధ్య, క్రాంతి కుమార్, జ్యోతి,జయ తదితరులు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం