మన ప్రగతి న్యూస్/హత్నూర:
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టి పి టి ఎఫ్ హత్నూర మండలం నూతన కమిటీ ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్, రామచందర్, తెలిపారు. హత్నూర మండల అధ్యక్షులుగా నరేష్, ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా నర్సింగ్, లోకనాథం, జ్యోతి, కార్యదర్శులుగా గంగరాజు, ధర్మారావు, వెంకటేశం, ప్రసన్న, జిల్లా కౌన్సిలర్లు గా గణేష్, రజిని, గణేష్, గౌసుద్దీన్, మల్లప్ప, నరేష్, మాధురి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా సత్యనారాయణ, సభ్యులు ప్రేమలత, సోషల్ మీడియా కన్వీనర్ గా మంజుల, సభ్యులు సంధ్యారాణి,లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు నరేష్, మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవినిచ్చినందుకు రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయుల డి ఏ, పి ఆర్ సి,సి పి ఎస్, విధానాన్ని రద్దు తదితర సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తూ ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.