మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ఎత్తున నాయకుల కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు, ఐఎన్ టియుసి నాయకులు బారి ఎత్తున్న పాల్గొన్నారు.