- ఐదుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్10,610/- రూపాయల నగదు స్వాధీనం
మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడ నిర్వహించారు.రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్(ఐజి)ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్,టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న,టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి,మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల బస్తీ లో ఏలూరి రవి అనే వ్యక్తి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై దాడి చేసి,పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను, మరియు నిర్వాహకుడు రవిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 10,610/- రూపాయల నగదు,పేక ముక్కలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
నిందితుల వివరాలు
1)నిర్వాహకుడు
ఏలూరి రవి,తండ్రి,నర్సయ్య
వయస్సు:62 కులం,తెనుగు,
నివాసం,కన్నాల బస్తీ,బెల్లంపల్లి
2)గడికొప్పుల భీమయ్య,తండ్రి రాజారావు,వయస్సు: 40 కులం పెర్క,వృత్తి,వ్యవసాయం,నివాసం,కన్నాల గ్రామం బెల్లంపల్లి .
3)ఎమ్.ఏ.నబీ,తండ్రి,మొయినుద్దీన్
వయస్సు:62,కులం,ముస్లిం,వృత్తి ఆర్.టి.డి ఎస్.ఎస్.సి.ల్,నివాసం అశోక్ నగర్ బెల్లంపల్లి
4) ఆరెపల్లి పోశం,తండ్రి,నర్సయ్య
వయస్సు:45,కులం,యాదవ్,వృత్తి డ్రైవర్,నివాసం 24 డీప్,బెల్లంపల్లి
5) దాాగం చరణ్,తండ్రి పోషం
వయస్సు:34, కులం ఎస్.సి నేతకాని
వృత్తి వ్యవసాయం,నివాసం,గ్రౌండ్ బస్తీ,బెల్లంపల్లి