Breaking News

డ్రైనేజీ కాలువపై ఆక్రమ నిర్మాణం..!నోటీసులు జారీ చేసిన స్పందించని వ్యాపారులు..రేగొండ లో అధికారులతో కలిసి కూల్చివేత…

మన ప్రగతి న్యూస్/రేగొండ :
మండల కేంద్రంలోని భూపాలపల్లి పరకాల రహదారి పై పెద్ద బస్టాండ్ ఆవరణంలో డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను గ్రామ కార్యదర్శి, గ్రామపంచాయతీ అధికారులతో కలిసి కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే రేగొండ మండల కేంద్రంలో బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, అధికారులు, సిబ్బంది జెసిబి తో అక్రమ నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టారు. పరకాల భూపాలపల్లి ఎన్ హెచ్ 363 ప్రధాన రహదారిపై ప్రధానంగా చాలా మీటర్ల మేర అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి వ్యాపారస్తులకు చాలా రోజుల నుండి నోటీసులు జారీ చేశారు. మురికి కాల్వలపై అక్రమ కట్టడాలతో మురుగు నీరు ముందుకు కదలడం లేదని రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఏళ్ల తరబడి పూడికలు తీయకపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. వాన కాలంలో వరదతో పాటు వ్యర్ధాలు బయటకు వెళ్లకుండా రోడ్డు పై నీరు నిలిచి ఉండగా దారిన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగ పలువురు అధికారులకు వివరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి డ్రైనేజీల పైన కూడా షెడ్లను నిర్మిస్తున్నారని మురుగు కాలువల పైన ఎటువంటి ఇండ్లను నిర్మించవద్దని వెంటనే ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చూడాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గడ్డం రాంప్రసాద్ రావు, కార్యదర్శి తుల్జారాణి, కారోభార్ ముస్కే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలు ఉపేక్షించేది లేదు..
ఎంపీడీవో వెంకటేశ్వరరావు..
నిబంధనకు వ్యతిరేకంగా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని ఎంపీడీవో వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి వారైనా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే వాటిని కూల్చివేయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.అక్రమ నిర్మాణాలకు పాల్పడినవారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనియెడల పోలీసు సహకారంతో కూల్చివేయడం జరుగుతుందన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం