Breaking News

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

డిఆర్డిఏ పిడి వసంత

-జాబితా ఎంపికపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు

-పగడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం అంటున్న అధికారులు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి

నియోజకవర్గం ప్రతినిధి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని డిఆర్డిఏ పిడి వసంత అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి, సిరిసన్నగూడెం లో తాసిల్దార్ పి. శ్రీనివాస్, నర్సింగాపురం తండా‌ లో ఎంపీడీవో ఏ.రాములు బమ్మెర, ఈరవెన్ను గ్రామాల్లో వెటర్నరీ డాక్టర్ డి.అశోక్ రెడ్డి, మంచుప్పు లో ఎంపిఓ ఎస్.రవీందర్, తిరుమలగిరి లో ఆర్ డబ్ల్యూఎస్ డిఈఈ కే.సంధ్య, మల్లంపల్లి లో ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ ఎన్.ప్రశాంతి, విస్నూరు లో మండల వ్యవసాయ అధికారి ఆర్.శరత్ చంద్ర, ప్రత్యేక అధికారులు పాల్గొని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్రామ సభను నిర్వహించారు. అధికారులు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన ముసాయిదాను‌ ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితా ను గ్రామ సభ ఆమోదం పొందిన తరువాత అర్హుల జాబితా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామసభల్లో పాల్గొన్న ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు అందుతాయన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించామన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందుతుందన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం అందిస్తుందన్నారు. నాలుగు ప్రభుత్వ పథకాల కోసం ముసాయిదాలో పేర్లు లేనట్లయితే గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డిస్క్ ల వద్ద దరఖాస్తు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రజల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

  • జాబితా ఎంపికపై అధికారం నిలదీస్తున్న ప్రజలు

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగాయి ప్రస్తుతం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను సంబంధించి చాలా ఓకతోకలు ఉన్నాయంటూ గ్రామ గ్రామాన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు నిజమైన అర్హుల పేర్లు జాబ్ చేయాలో లేవంటూ కొన్ని గ్రామాలలో ఆంధ్రాలో దిగారు. రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల జాబితాలు తప్పుడు తలకా ఉన్నాయంటూ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.

  • పగడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామంటున్న అధికారులు

సందర్భంగా ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ ఈనెల 24 వరకు లబ్ధిదారుల ఎంపిక కొత్త దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి అవకత లేకుండా పగటిబందిగా జరుపుతామని ప్రజలకు తెలిపారు ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన పెద్దపనే తుది జాబితాను పై అధికారుల ఆదేశాల మేరకు విడుదల చేస్తామన్నారు ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలుతోపాటు వివిధ పథకాల వివరాలను ప్రభుత్వం సంకల్పాన్ని గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు సాగులో లేని భూములను ప్లాట్లు రియల్ ఎస్టేట్ భూములను సైతం గుర్తించి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకానికి నిరంతరంగా కొనసా కొత్త దరఖాస్తులను తీసుకుంటామన్నారు ప్రజల అభ్యంతరాలు అన్నిటిని పరిశీలిస్తామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులను చేసుకుని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.